: యాసిన్ భత్కల్ ను పట్టుకుని.. వదిలేశారు..!
హైదరాబాద్ బాంబు పేలుళ్ల అనుమానితుడు యాసిన్ భత్కల్ ను ఓసారి కోల్ కతా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత విడిచి పెట్టినట్టు తెలుస్తోంది. 2008లో నకిలీ నోట్ల కేసులో యాసిన్ భత్కల్ అరెస్టయ్యాడు.
ఆ తర్వాత కొద్ది కాలానికే బయటికొచ్చాడు. యాసిన్ నిషేధిత ఇండియన్ ముజాహిదిన్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడు. అదుపులోకి తీసుకుని వదిలివేసిన విషయమై కోల్ కతా జాయింట్ పోలీస్ కమిషనర్ రజిబ్ మిశ్రాను వివరణ అడగ్గా... ఇదేం కొత్త విషయం కాదంటూ, అందరికీ తెలిసిన విషయమేనన్నారు.