: కసాయికి ఉరి ఆగింది.. ఊపిరి నిలిచింది


ఆడపిల్లలైనందుకు ఐదురుగురు కన్నబిడ్డల్ని గొడ్డలితో నరికేసిన కసాయి తండ్రిని ఈ ఉదయం ఉరి తీయాల్సి ఉండగా అర్థరాత్రి అందిన ఆదేశాల మేరకు అధికారులు శిక్ష అమలు ఆపేశారు. మధ్యప్రదేశ్ కి చెందిన మగన్ లాల్ అనే వ్యక్తి 2011లో ఏడాది నుంచి ఆరేళ్లలోపు వయసు గల తన ఐదుగురు కుమార్తెలను హతమార్చాడు. నేరం నిరూపితం కావడంతో అతనికి ఉరిశిక్ష పడింది. కాగా, అతనికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ రాష్ట్రపతి వద్దకు అతని ఫైల్ రాగా ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్షను తిరస్కరించారు. కొంతమంది సామాజిక కార్యకర్తలు గత రాత్రి ఈ విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. దీంతో, ఈ శిక్ష నిలుపుదల ఉత్తర్వులు జారీ చేశారు. మరణశిక్షను జీవితఖైదుగా మార్చమని వారు కోరుతున్నారు. ఈ కేసు నేడు సుప్రీం కోర్టు ముందుకు రావచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News