: ఆంధ్రప్రదేశ్ ను రక్షించండి: రాజ్యసభలో టీడీపీ నినాదం
పార్లమెంటు ఉభయసభల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ను రక్షించండంటూ బిగ్గరగా నినదించారు. తమ ప్రాంత ప్రయోజనాలు రక్షించాలంటూ వారు చైర్మన్ వెల్ లోకి దూసుకెళ్ళారు. ఓవైపు వారు నినదిస్తుండగానే.. పలు బిల్లులు ప్రవేశపెట్టేందుకు యత్నించడంతో టీడీపీ ఎంపీలు డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ నుంచి పేపర్లు, మైకు లాక్కునే యత్నాలకు తెరదీశారు. దీంతో, సభను మధ్యాహ్నం 12.30 వరకు వాయిదావేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.