: మధ్యాహ్న భోజన పథకంపై మేనకా గాంధీ లేఖ
మధ్యాహ్న భోజన పథకంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు బీజేపీ సీనియర్ నేత మేనకాగాంధీ లేఖ రాశారు. ఈ పథకం కింద పాఠశాల చిన్నారులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ విషయాన్ని లక్నోలోని తన కార్యాలయంలో స్వయంగా మేనకా గాంధీ తెలిపారు. భోజనంలో పురుగులు, బల్లులు వస్తున్నాయని, ఈ విషయాన్ని తన నియోజకవర్గం అనొల పర్యటనలో గుర్తించినట్లు లేఖలో పేర్కొన్నారు. కాబట్టి, ఆహారం తయారు చేసేటప్పుడు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.