: వీరజవానుకు అంత్యక్రియలు పూర్తి
పాక్ సైన్యం చేతిలో బలైపోయిన వీరజవాను, బీహార్ రెజిమెంటుకు చెందిన ప్రేమ్ నాథ్ సింగ్ అంత్యక్రియలు గురువారం బీహార్ లోని ఆయన స్వగ్రామం సమౌతాలో సైనిక లాంఛనాలతో జరిగాయి. బంధువులు, వందలాది మంది ప్రజలు, పలు పార్టీలకు చెందిన నేతలు ప్రేమ్ నాథ్ కు ఘన నివాళి అర్పించారు. స్థానిక పోలీసులు, ఆర్మీ సహచరులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.