: హైదరాబాద్ లో మళ్లీ ఉగ్ర దాడులకు అవకాశం
కేంద్రం నుంచి మళ్లీ ఉగ్ర హెచ్చరికలు విడుదలయ్యాయి. మరోసారి ముష్కరులు భాగ్యనగరంపై బాంబులతో విరుచుకుపడే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, చెన్నై, కోల్ కతా, బెంగళూరు నగరాలలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చంటూ కేంద్ర హోంశాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆయా నగరాలలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.