: కేసీఆర్ కు చెప్పే రాజీనామా చేశా: విజయరామారావు
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జి.విజయరామారావు పార్టీకి రాజీనామా చేశారు. అధినేత కేసీఆర్ ను మెదక్ జిల్లా గజ్వేల్ ఫాంహౌస్ లో కలిసి, ఆయనకు చెప్పే పార్టీని వీడుతున్నానని విజయరామారావు ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ కు లేఖ ఇచ్చానని వెల్లడించారు. పార్టీ పురుడుపోసుకున్నప్పటినుంచి చురుగ్గా వ్యవహరిస్తున్నా, కీలక పదవులు అప్పజెప్పకుండా అణగదొక్కేందుకు యత్నించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, పార్టీ నుంచి బయటికి రావాలని నిశ్చయించుకున్నట్టు తెలిపారు. అయినా, పార్టీలో కడియం శ్రీహరి, రాజయ్య వంటి నేతలున్నారని, ఇక తన అవసరం ఏముంటుందని ఆయన నిర్వేదపూరితంగా వ్యాఖ్యానించారు.