: అక్రమాస్తుల కేసులో మాయావతికి ఊరట
అక్రమాస్తుల కేసులో బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతికి సుప్రీం కోర్టులో ఊరట కలిగింది. మాయావతిపై మరోసారి సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అయితే, తాజ్ కారిడార్ కేసుకు మాత్రమే తమ ఉత్తర్వులు వర్తిస్తాయని సుప్రీం స్పష్టీకరించింది. తమ ఆదేశాలను అర్ధం చేసుకోకుండా సీబీఐ మాయావతి ఆస్తుల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందంటూ మే 1న ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. దాంతో తీర్పు రిజర్వులో ఉంది.