: అమితాబ్ కు కోర్టు నోటీసులు
పాప్యులర్ టీవీ క్విజ్ షో 'కౌన్ బనేగా క్రోర్ పతి' (కేబీసీ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు అహ్మదాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ఈ షో నిర్మాత సిద్ధార్థ్ బసుకు కూడా నోటీసులు అందాయి. సోనీ ఎంటర్ టైన్ మెంటు ఛానల్ లో వస్తున్న కేబీసీ ప్రోమోలు న్యాయవాదులు, న్యాయవాద వృత్తిని అగౌరవపరిచేలా ఉన్నాయంటూ దేవిందర్ సింగ్ రక్కడ్ అనే న్యాయవాది కొన్ని రోజుల కిందట పిటిషన్ వేశాడు. దీనిపై విచారించిన కోర్టు వారిద్దరికి నోటీసులు పంపింది. ఈనెల 21లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.