: వాయిదాపడిన పంచాయతీల్లో పోలింగు ప్రారంభం
భారీ వర్షాల కారణంగా వాయిదాపడిన ఆదిలాబాద్, గుంటూరు జిల్లా పంచాయతీల్లో ఈ ఉదయం 7 గంటల నుంచే పోలింగు ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలో 12 పంచాయతీల్లో, ఆదిలాబాద్ లో సిర్పూర్ (యు) మండలం పండిగి, భీమిని మండలం లక్ష్మీపూర్ పంచాయతీల్లో పోలింగు జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. మొత్తం 118 పోలింగు స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్ వ్యవస్థను కలెక్టరేట్ తో అనుసంధానం చేశారు.