: ఈ ఎక్స్‌`రే బంగారాన్ని కనిపెట్టేస్తుందట!


బంగారాన్ని గుర్తించే ఒక సరికొత్త ఎక్స్‌`రేని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. బంగారం అంటే మనం వేసుకునే బంగారు నగలు కాదు... భూగర్భం నుండి వెలికివచ్చే ఖనిజాల్లో లభించే బంగారం... భూమినుండి వెలికివచ్చే ఖనిజాల్లో ఎంతమేర బంగారం ఉంది? అనే విషయాన్ని ఈ ఎక్స్‌`రే ఇట్టే చెప్పేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆష్ట్రేలియాలోని కామన్‌ వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఆర్‌ఓ) కు చెందిన శాస్త్రవేత్తలు భూమినుండి తవ్వి వెలికితీసిన ఖనిజాల్లో బంగారం ఎంతమేర ఉంది అనే విషయాన్ని కచ్చితంగా చెప్పే ఒక సరికొత్త ఎక్స్‌`రే పద్ధతిని కనుగొన్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు గామా యాక్టివేషన్‌ అనాలసిస్‌ (జీఏఏ) ఆధారంగా పనిచేసే సాంకేతికతను ఉపయోగించారు. ఇది సాంప్రదాయ 'ఫైర్‌ అసే' కంటే కూడా మూడురెట్లు వేగంగా నిర్ధిష్టంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా అరకేజీ ఖనిజంలో ఎంతశాతం బంగారం ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి సంప్రదాయ పద్ధతిలో ఖనిజాన్ని 1200 డిగ్రీలతో వేడిచేస్తేకానీ సాధ్యం కాదు. ఈ పరీక్షలు కూడా భారీ ప్రయోగశాలల్లో చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సరికొత్త ఎక్స్‌`రే పరిజ్ఞానంతో అరకేజీ ఖనిజంలో ఎంతమేర బంగారం ఉంది అనే విషయాన్ని నిముషాల్లో చెప్పేయవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ జేమ్‌ టిక్‌నర్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News