: నానో'లిసా'!


లియోనార్డో డావిన్సి చిత్రించిన అద్భుత సృష్టి మోనాలిసా చిత్రం. ఈ చిత్రాన్ని ఇప్పటికి ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని సైజుల్లో ఆవిష్కరించారో... అయితే అత్యంత బుల్లి చిత్రాన్ని మాత్రం ఎవరూ ఆవిష్కరించలేదు. మోనాలిసా బుల్లి చిత్రాన్ని సాంకేతిక శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఎంత బుల్లి చిత్రం అంటే మన తలవెంట్రుకలో మూడవ వంతు వెడల్పు ఉండే అతి చిన్న కాన్వాసుపై మోనాలిసాను ఆవిష్కరించారు.

జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అతి చిన్న రూపంలో మోనాలిసా చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ బుల్లి మోనాలిసా పేరు 'మినీ లిసా'. ఇప్పటి వరకూ ప్రపంచంలోనే ఇది అత్యంత బుల్లి చిత్రమని చెబుతున్నారు. ఎంత చిన్నదంటే మన తలవెంట్రుకలో మూడవవంతు వెడల్పుండేంత చిన్న కాన్వాసుపై మోనాలిసా చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ బుల్లి చిత్రాన్ని ఆవిష్కరించడానికి శాస్త్రవేత్తలు థర్మో కెమికల్‌ నానో లిథోగ్రఫీ (టీసీఎన్‌ఎల్‌) అనే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

పరమాణువు స్థాయిలో కూడా నిశితంగా చూడగల సూక్ష్మదర్శినిని ఇందుకు ఉపయోగించారు. పలు ఉష్ణోగ్రతల వద్ద వేడిని నియంత్రిస్తూ రసాయన చర్యలు జరపడం ద్వారా వివిధ వర్ణాల్లో ఈ బొమ్మను వేయగలిగారు. ఈ పరిజ్ఞానం నానో ఉత్పత్తుల తయారీకి, నానో`ఎలక్ట్రానిక్స్‌, ఆప్టో`ఎలక్ట్రానిక్స్‌, బయో ఇంజినీరింగ్‌ రంగాల్లో పరిశోధనలకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఎంత పెద్ద చిత్రాన్నైనా కూడా చిన్న చిన్న పరిమాణాల్లో స్పష్టంగా ముద్రించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News