: రేపటి కేంద్ర కేబినెట్ సమావేశం అజెండాలో తెలంగాణ అంశం లేనట్టే!
రేపటి కేంద్ర కేబినెట్ సమావేశం అజెండాలో తెలంగాణ అంశం లేదని తెలుస్తోంది. గత కేబినెట్ సమావేశం నాటికి తెలంగాణ అంశం నోట్ సిద్ధం కాకపోవటంతో రేపు జరగబోయే సమావేశం అజెండాలో తెలంగాణ అంశం ఉంటుందని భావించారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల నేపధ్యంలో ఆంటోని నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆంటోని కమిటీ నివేదిక అందిన తరువాత నోట్ ను తయారు చేసి తదుపరి కేబినెట్ సమావేశం అజెండాలో చేర్చనున్నట్టు తెలుస్తోంది.