: రేపు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్న విజయశాంతి
విజయశాంతి రేపు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఒక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. అగస్టు 8న విజయశాంతి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు ఈ మధ్యనే ప్రచారం జరిగింది. రేపు ఆమె సోనియా గాంధీని కలవనున్నారని సమాచారం. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. జూలై 31న విజయశాంతిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.