: నిర్భయ కుటుంబానికి సోనియా అభయం


ఢిల్లీలో సామూహిక అత్యాచార బాధితురాలు నిర్భయ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆపన్న హస్తం అందిస్తామన్నారు. నైరుతి ఢిల్లీలో నివసిస్తున్న నిర్భయ కుటుంబాన్ని శనివారం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్భయ కుటుంబానికి ద్వారకాలో ఇల్లు కేటాయిస్తామని సోనియాగాంధీ వారికి హామీ ఇచ్చారు. అలాగే నిర్భయ ఇద్దరు తమ్ముళ్లలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దాదాపు గంటసేపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నిర్భయ కుటుంబంతో గడిపారు.

  • Loading...

More Telugu News