: పాక్ ఆర్మీకి ఆంటోనీ క్లీన్ చిట్ ఇవ్వలేదు: కాంగ్రెస్


కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పూంచ్ సెక్టార్ లో ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపిన ఘటనలో పాక్ ఆర్మీకి ఆంటోనీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పష్టం చేశారు. బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. చర్చల ద్వారానే వివాదాలు పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News