: పరిహారం వద్దు, పాక్ పై యాక్షన్ తీసుకోండి: మృత జవాను భార్య
దేశం కోసం ఆ వీరజవాను ప్రాణాలనే అర్పిస్తే.. అతని భార్య తనకు పరిహారం వద్దంటూ, శత్రుదేశం పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలంటూ గర్జించింది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ దళాలు (?) ఐదుగురు భారత జవాన్లను బలిదీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో బీహార్ కు చెందిన విజయ్ కుమార్ రాయ్ కూడా ఉన్నాడు. రాయ్ స్వస్థలం పాట్నా సమీపంలోని దానాపూర్. తమ రాష్ట్రీయుడు వీరమరణం పొందడంతో బీహార్ ప్రభుత్వం అతని కుటుంబానికి రూ.10 లక్షల చెక్ ఇచ్చేందుకు అధికారులను పంపింది. ఆత్మాభిమానం మెండుగా ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఆ చెక్ తీసుకునేందుకు నిరాకరించారు. బయటికి నడవండంటూ అధికారులకు గేటు చూపించారు. తక్షణమే పాక్ పై చర్యలు తీసుకోవాలని అతని భార్య శివంగిలా గర్జించింది.