: రాష్ట్ర పర్యాటకులకు అందుబాటులో ఇన్నోవా కార్ల సేవలు


రాష్ట్రాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు మెరుగైన సేవలు కల్పించేందుకు ఏపీ టూరిజం మినీ ఏసీ బస్సులతో పాటు ఇన్నోవా కార్ల సేవలందించేందుకు ఏర్పాట్లు చేసింది. నేడు హైదరాబాద్ లో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ ఈ సేవలను ప్రారంభించారు. ఈ సర్వీసులు హైదరాబాద్ నుంచి శ్రీశైలం, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం మార్గాల్లో సేవలందించనున్నాయి. కాగా ఈ వాహనాల్లో ప్రయాణించే పర్యాటకులకు అనేక సదుపాయాలు కల్పించినట్టు చందనాఖాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News