: ధోనీని దొరకబుచ్చుకోవడం చాలా కష్టం: కోహ్లీ
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అతడి డిప్యూటీ విరాట్ కోహ్లీ ఏమంటున్నాడో వినండి. ధోనీకి సెలవు దొరికితే అతడిని పట్టుకోవడం చాలా కష్టమంటున్నాడు. జింబాబ్వేపై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఆ ఆనందాన్ని ధోనీతో పంచుకోవాలనుకుంటే, అతడు ఫోన్లో దొరకడంలేదని ఫిర్యాదు చేస్తున్నాడీ ఢిల్లీ యువ కెరటం. కనీసం మెసేజ్ చేద్దామన్నా వీలుకావడంలేదని వాపోయాడు. ధోనీ తిరిగొస్తే గానీ, అతనితో ముచ్చటించలేనని తెలిపాడు. ఢిల్లీలో ఓ వాణిజ్య ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా, జట్టులోని ఇతర ఆటగాళ్ళతో ధోనీ పెద్దగా ఫోన్ సంబంధాలు పెట్టుకోడని ఇంతకుముందూ ఫిర్యాదులు వచ్చాయి. సాక్షాత్తూ లక్ష్మణ్ అంతటి దిగ్గజ ఆటగాడే ధోనీతో ఫోన్ లో మాట్లాడేందుకు విఫలయత్నాలు చేయడం గమనార్హం.