: శ్రీలంక రాయబారికి భారత్ సమన్లు
శ్రీలంక అదుపులో ఉన్న వందమంది భారత జాలర్లను విడుదల చేయాలని ఆ దేశ రాయబారికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. అరెస్టయిన వారిలో తమిళనాడుకు చెందిన జాలర్లే ఎక్కువగా ఉన్నారని, 21 బోట్లు కూడా లంక స్వాధీనంలో ఉన్నాయని అందులో పేర్కొంది. విదేశీ సముద్ర జలాల నిబంధనలు అతిక్రమించారంటూ గత రెండు నెలల్లో శ్రీలంక పెద్ద సంఖ్యలో జాలర్లను అరెస్టు చేసిందని భారత్ పేర్కొంది. సమన్లను లంక హై కమిషనర్ ప్రసాద్ కరియవాసమ్ కు మంత్రిత్వ శాఖ అందజేసింది.