: కాంగ్రెస్ దొడ్డి దారులు వెతుకుతోంది: పయ్యావుల
ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు కాంగ్రెస్ దొడ్డి దారులు వెతుకుతోందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అథిష్ఠానం ప్యాకేజీల పేరుతో సీమాంధ్రులను మోసగించాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.