: పార్టీలు బరిలో లేకున్నా తప్పని అవనిగడ్డ ఉపఎన్నిక
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది. టీడీపీ అభ్యర్థిగా దివంగత అంబటి బ్రహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి బాబు బరిలో దిగనున్నాడు. టీడీపీ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలన్నీ పోరుకు దూరంగా ఉన్నాయి. దీంతో శ్రీహరి బాబు ఎన్నిక లాంఛనమే అనుకున్నారంతా, కానీ స్వతంత్ర అభ్యర్థులుగా రావు సుబ్రమణ్యం, పైకం రాజశేఖర్ బరిలో నిలిచారు. వీరికి నచ్చజెప్పేందుకు టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నెల 21న అవనిగడ్డ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనుంది.