: బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన మాంటీ పనేసర్


ఇంగ్లిష్ స్పిన్నర్ మాంటీ పనేసర్ కు జరిమానా విధించారు. పూటుగా మద్యం తాగి బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయడంతో పనేసర్ జరిమానాకు గురయ్యాడు. లండన్ సౌత్ కోస్ట్ ప్రాంతమైన బ్రైటన్ లోని ఓ నైట్ క్లబ్ లో పీకలదాకా మందు పట్టించిన ఈ భారత సంతతి క్రికెటర్.. ఏంచేస్తున్నాడో తెలియని స్థితిలో ఈ పని చేశాడని పోలీసులు తెలిపారు. కాగా, ఈ సంఘటన అనంతరం పనేసర్ ను క్లబ్ నుంచి బయటికి గెంటినట్టు తెలుస్తోంది. తెల్లవారుజాముదాకా తాగడమే పనిగా పెట్టుకున్న ఈ సర్దార్జీ పనిలోపనిగా క్లబ్ ఆవరణలో అమ్మాయిలనూ వేధించాడట. పనేసర్ యాషెస్ సిరీస్ లో తలపడుతున్న ఇంగ్లండ్ జట్టు సభ్యుడు. జట్టుకు ఎంపికైనా తుది 11 మందిలో చోటు సంపాదించలేకపోయాడు. లెఫ్టార్మ్ స్పిన్నరైన పనేసర్ 48 టెస్టుల్లో 164 వికెట్లు పడగొట్టాడు.

  • Loading...

More Telugu News