: రాష్ట్ర విభజన చాలా కష్టమైన పని: దిగ్విజయ్ సింగ్
కుటుంబంలాంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడం చాలా కష్టమైన పని అని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమస్య చాలా ఏళ్లుగా నలుగుతోందని, ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపిన ఆయన, ఆంటోనీ కమిటీ నేటి నుంచే పని ప్రారంభిస్తుందని అన్నారు. ఎన్జీవోలు, విద్యార్థులు, అన్ని పక్షాల రాజకీయ నాయకులు కమిటీ ముందు అభిప్రాయాలు చెప్పొచ్చని స్పష్టం చేశారు. అన్ని అభిప్రాయాలు విన్న తరువాత అందరికీ సంతృప్తికరమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవోలు సమ్మెకు వెళ్లవద్దని ఆయన సూచించారు. సమ్మెకు వెళ్లకుండా, ఎపీఎన్జీవోలు తమ అభిప్రాయాలను ఆంటోనీ నేతృత్వంలోని కమిటీకి చెప్పాలని సలహా ఇచ్చారు.