: విభజన చిచ్చుకు ఇద్దరు మృతి
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సీమాంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విభజనను తట్టుకోలేక ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం ఎర్రసాల గ్రామానికి చెందిన ఆంజనేయులు(55)అనే రైతు గుండెపోటుతో మరణించాడు. ఆంజనేయులు మృతి చెందడంతో అతని కుటుంబం దిక్కులేనిదైపోయింది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నాగరాజు(35) వారం రోజులుగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తీవ్ర మనోవ్యధకు గురై టీవీలో వార్తలు చూస్తూ కుప్పకూలిపోయాడు.