: టీడీపీ ఎంపీల ఆందోళన.. రాజ్యసభ రేపటికి వాయిదా
తమ ప్రాంత ప్రయోజనాలు రక్షించాలంటూ తెలుగుదేశం ఎంపీలు రాజ్యసభలో చేస్తున్న నినాదాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఎంతచెప్పిన వినకుండా తమ పంథాలో నిరసన కొనసాగిస్తుండటంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను రేపటికి వాయిదా వేశారు. గత రెండు రోజుల నుంచి సభలో ఇదే తీరుతో ఎంపీలు నిరసనలు చేస్తుండటంతో సభ సజావుగా కొనసాగలేదు. దాంతో, వాయిదాల పర్వం కొనసాగుతోంది.