: నెల్లిమర్ల ఎమ్మెల్యే రాజీనామా
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అప్పలనాయుడు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. దీంతో స్థానికులు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నిస్తూ రాజీనామాలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజల కోరికమేరకు ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.