: జవాన్ల ఘటనపై పాక్ తో ప్రధాని చర్చిస్తారు: సల్మాన్ ఖుర్షీద్
కలకలం రేపుతున్న జమ్మూ కాశ్మీర్ లో భారత జవాన్ల ఘటనపై ఇండో-పాక్ చర్చల్లో భాగంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చర్చించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో ఈ చర్చలు జరగనున్నాయని, ఎప్పుడు జరిగేది ప్రధాని నిర్ణయిస్తారని మీడియాతో చెప్పారు. మరోవైపు దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలలో పాక్ తో సమావేశం అవ్వాలని ప్రధాని అన్నట్లు పేర్కొన్నారు.