: కండల వీరుల మధ్య మొదలైన పోటీ


కండల వీరులు అక్కడికి చేరుకున్నారు. బలిష్టమైన శరీరాన్ని వంపు, సొంపులుగా తీర్చి దిద్దుకుని మరీ వచ్చారు. శ్వాసను ఎగబీల్చి బిగపట్టి కండరాలను బెలూన్లలా ఉబ్బించడానికి అందరూ రెడీ అయిపోయారు. ఎవరి శరీర సౌష్టవం అందంగా, నాజూకుగా, ఎక్కువ షేపులతో ఆకట్టుకుంటే వారే మిష్టర్ ఇండియా!

జూనియర్ విభాగంలో జాతీయ శరీర సౌష్టవాల  పోటీలు (బాడీ బిల్డింగ్) ఖమ్మం పట్టణంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ రోజు ప్రారంభం అయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి 277 మంది క్రీడాకారులు ఈ పోటీల కోసం తరలివచ్చారు. మిష్టర్ వరల్డ్, అర్జున అవార్డు గ్రహీత ప్రేమ్ చంద్ డోగ్రే, టీవీ పాలీ కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News