: సచివాలయ ఉద్యోగుల వినూత్న నిరసన
సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయ ఉద్యోగులు వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులంతా వెనక్కి నడుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి హైదరాబాదుపై నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులు ఈ సందర్భంగా కోరారు.