: సరిహద్దు భద్రతపై ఆర్మీ చీఫ్ అత్యవసర సమీక్ష


జమ్మూకాశ్మీర్లోని సరిహద్దుల్లో పాక్ దళాలు కాల్పులు, ఐదుగురు భారత జవాన్ల మృతితో భద్రతపై ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ సమీక్షించారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి జమ్మూ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన '16 కార్ప్స్' ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉన్నతాధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. సరిహద్దుల్లో కాల్పులు, నిన్న జరిగిన సైనికుల హత్యాకాండపై స్థానిక అధికారులు బిక్రం సింగ్ కు వివరించారు. భద్రతను పటిష్ఠం చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News