: రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ చెన్నైలో నిరాహార దీక్ష
తెలుగు వారి ఐక్యతను చాటేలా జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రత్యక్ష సాక్షి తమిళనాడు. తమిళులతో అన్నదమ్ముల్లా విడిపోయిన తెలుగు జాతి.. ఇప్పుడిలా ముక్కలవుతుంటే అక్కడి తెలుగు సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. భాషా ప్రాతిపదికన విడివడడం సాధారణమే కానీ సరైన ప్రాతిపదిక లేకుండా విభజన సరికాదంటూ అక్కడి తెలుగు సంఘాల సభ్యులు నిరాహార దీక్షకు దిగారు. విడిపోయి సాధించేదేమీ ఉండదని కలసికట్టుగా ఉండడమే సరైనదని, ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దని కోరుతూ చెన్నైలోని తెలుగు సంఘాలు కోరుతున్నాయి. కేంద్రంలో ఉన్న తమిళ ప్రజా ప్రతినిధులు విభజన సరికాదని కేంద్రానికి సూచించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.