: మంటగలుస్తున్న మానవీయత.. బ్యాగులో బాలుడి శవం!


సమాజంలో పైశాచికత్వం నానాటికీ మితిమీరుతోందనడానికి మరో నిదర్శనంలా.. ఓ ప్యాసింజర్ రైల్లో బ్యాగులో బాలుడి మృతదేహం దర్శనమిచ్చింది. గుర్తు తెలియని దుండగులు హత్య చేసి బాలుడిని గోనె సంచిలో పడేశారు. ఈ బాలుడు గుంటూరు జిల్లా శావల్యా పురం వాసి సాయి ఫణీంద్ర(10) గా తెలుస్తోంది. మహబూబ్ నగర్ వద్ద డోన్ రైల్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ బ్యాగును ఎవరు వదిలివెళ్లారనేది తెలియరాలేదు. బాలుడి అపహరణపై నిన్నగుంటూరు జిల్లా శావల్యాపురంలో కేసు నమోదైనట్టు సమాచారం. కాగా రైల్లోని ఇతర ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మృతదేహం మహబూబ్ నగర్ పోలీసుల అధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News