: ఆసీస్ 380 ఆలౌట్
చెన్నయ్ లో టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 380 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 316/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 64 పరుగులు జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది.
తొలి రోజు కంగారూల పతనాన్ని శాసించిన అశ్విన్... లియాన్ (3)ను అవుట్ చేయడంతో సరిగ్గా లంచ్ వేళకు ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. అశ్విన్ మొత్తం 7 వికెట్లు తీయగా.. జడేజాకు రెండు, హర్భజన్ కు ఓ వికెట్ దక్కాయి. ఎనిమిదో వికెట్ రూపంలో కెప్టెన్ క్లార్క్ (130) వెనుదిరగడంతో ఆసీస్ పతనం ఊపందుకుంది.