: బీజేపీ అగ్రనేతలతో సాయంత్రం ప్రధాని సమావేశం
ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. సరిహద్దుల్లో కాల్పుల ఘటనపై పార్లమెంటులోనూ, బయటా.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చోటు చేసుకున్న తీవ్ర వాగ్వాదాల నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ బీజీపీ నేతలను కలవాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. కాల్పుల ఘటనపై సైన్యం, రక్షణ శాఖ చేసిన ప్రకటనలు విరుద్దంగా ఉండడంతో పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉండగా ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత, పాక్ ప్రధానుల సమావేశం షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.