: దేశ రాజధానిలో యువతి కాల్చివేత


దేశ రాజధానిలో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. ఇంట్లో ఉన్న ఓ యువతి (17)పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఆగ్నేయ ఢిల్లీలోని దక్షిణాపురిలో ఆ యువతి తన ఇంట్లో ఉండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి మెడ భాగంలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం వారు బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమ పేరిట వేధిస్తున్న వ్యక్తో, మరేదైనా వ్యక్తిగత కలహాలో ఈ సంఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News