: శంషాబాద్ విమానాశ్రయంలో కారు కలకలం


హైదరాబాద్ లో బాంబు పేలుళ్ల భయం ఇంకా తొలగిపోకముందే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఒక అనుమానిత కారు కలకలం రేపింది. అందులో రెండు బ్యాగులు ఉండడంతో అక్కడి భద్రతా సిబ్బందికి చెమటలు పట్టించింది.

విమానాశ్రయం నుంచి ప్రయాణికులు బయటకు వెళ్లే మార్గంలో చాలా సేపుగా ఆ కారు అక్కడే ఉండడం మరిన్ని అనుమానాలకు దారి తీసింది. దీంతో వాటిలో బాంబులున్నాయేమో అన్న అలజడి మొదలైంది. బాంబు తనిఖీ బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నాయి. విమానాశ్రయం పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

  • Loading...

More Telugu News