: దేశీయ గూఢచర్యం లేదు: ఒబామా
దేశీయంగా గూఢచర్యం, నిఘా కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో అనుమానిత ఫోన్ నంబర్లు, ఈ-మెయిళ్లను ట్రాక్ చేసేందుకు తగిన యంత్రాంగం ఉందని, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ సమాచారం ఎంతో ఉపయోగకరమైనదని ఒబామా చెప్పారు. కానీ, దీనిపై ప్రజల్లో ఎన్నో సందేహాలు తలెత్తాయన్నారు.