: మరింత ఘాటెక్కిన గుంటూరు మిర్చియార్డు


అసలే మిర్చియార్డు. ఆపై సమైక్యాంధ్ర ఘాటు. ఇంకేముంది, రాష్ట్ర విభజన పట్ల రగిలిపోయింది ఆ వ్యాపార క్షేత్రం. గుంటూరులోని మిర్చి యార్డు వద్ద ఈ ఉదయం చోటు చేసుకున్న సన్నివేశం ఇది. రైతులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు, కార్మికులు.. అందరిదీ ఒకేమాట. జై సమైక్యాంధ్ర! ఈ క్రమంలో అందరూ ఏకతాటిపై నిలిచి కొనుగోళ్ళను ఈ రోజు, రేపు ఆపేయాలని స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఏడింటికే మిర్చియార్డులో కార్యకలాపాలు నిలిపేసి, గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో, పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News