: కర్ణాటకలో మెదక్ జిల్లా యువకులు మృతి
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సమీపంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. కొన్నిరోజుల కిందట గోవా విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కాగా, ప్రమాద ఘటన సమాచారాన్ని అధికారులు మృతుల కుటుంబసభ్యులకు తెలియజేశారు.