: రిస్క్ తీసుకునే నటుడిని నేనొక్కడినే: జాన్ అబ్రహాం


రిస్క్ తీసుకునే నటుడిని తానొక్కడినేని జాన్ అబ్రహాం సొంత ప్రచారాన్ని మొదలు పెట్టాడు. అదేమంటే ఆఫ్ఘానిస్థాన్ లో 'కాబూల్ ఎక్స్ ప్రెస్' చేశా, శ్రీలంకలో 'మద్రాస్ కేఫ్' చేశా.. కానీ ఎవరూ అర్థం చేసుకోలేదంటూ జాన్ తన అభిప్రాయాలను వివరించాడు. తనలాగే మరెవరైనా రిస్కు తీసుకుంటే సంతోషకరమన్నాడు. ప్రేక్షకులు తనను యాక్షన్ హీరోగానే చూస్తున్నారని చెప్పాడు. 'యాక్షన్ అబ్రహాం అని పిలుచుకుంటున్నారు.. ఆ పదబంధం ఎంతో బావుంది. 'జూతా హై' చిత్రం కోసం ఎంతో కష్టించి పనిచేశా కానీ ప్రతిఫలం లేదు. ఎందుకంటే ప్రేక్షకులు నన్ను ఎక్కువగా యాక్షన్ పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారు' అంటూ జాన్ వివరించాడు.

  • Loading...

More Telugu News