: ధర్మాన, సబితల కస్టడీపై నేడు సీబీఐ కోర్టు తీర్పు
మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిల జ్యుడీషియల్ కస్టడీపై నేడు నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ మేరకు వీరిద్దరూ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఇద్దరినీ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ దాఖలుచేసిన మెమోపై న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసింది. మరి ధర్మాన, సబితలను కోర్టు కస్టడీకి అప్పగిస్తుందా? లేదా? అనేది నేడు తేలనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వారిద్దరిపై తీవ్ర ఆరోపణలు రావడంతో పదవులకు రాజీనామా చేశారు.