: సిగ్నల్ లేనందుకు వొడాఫోన్ పై జరిమానా


కస్టమర్ నివాసిత స్థలంలో మొబైల్ సిగ్నల్ లేకపోవడం సేవాలోపంగా నిర్ధారిస్తూ మహారాష్ట్రలోని థానే జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పింది. కస్టమర్ కు 10,000 రూపాయల పరిహారాన్ని చెల్లించాలని వోడాఫోన్ కంపెనీని ఆదేశించింది. థానే జిల్లాకు చెందిన ప్రభాకర్ 2007లో వొడాఫోన్ సిమ్ కొనుగోలు చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా సిగ్నల్ ప్రాబ్లం ఉండదని డీలర్ హామీ ఇస్తేనే తీసుకున్నాడు. కానీ, 2007-08 కాలంలో తన స్వగ్రామం శ్రీవర్థన్ కు వెళ్లినప్పుడు అక్కడ అసలు వొడాఫోన్ సిగ్నలే లేకపోవడంతో ప్రభాకర్ 44,000 రూపాయల పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీంతో వొడాఫోన్ కంపెనీ, డీలర్ ఇద్దరూ కలిసి 10,000 రూపాయల పరిహారాన్ని చెల్లించాలని ఫోరం ఆదేశాలు జారీ చేసింది. సో, మీలో ఎవరైనా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటే తక్షణమే ఫోరాన్ని ఆశ్రయించండి. సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది. అందుకు ప్రభాకర్ ఉదంతమే నిదర్శనం.

  • Loading...

More Telugu News