: లగడపాటి నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల భేటీ
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భేటీల మీద భేటీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఉదయం ఢిల్లీలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిన్నటివరకూ సోనియా, చిదంబరం, దిగ్విజయ్ లకు విజ్ఞప్తి చేసిన ఎంపీలు.. నిర్ణయం వెనక్కు తీసుకునేది లేదని అధిష్ఠానం కరాఖండీగా చెప్పడంతో ప్రత్యామ్నాయాలవైపు చూపు మరల్చారు. ఇక ప్రత్యేక ప్యాకేజీలు, ప్రాంతాల వారీగా డిమాండ్లు చేయాలని వారు తలపోస్తున్నారు. ఇక ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలు సమాలోచనలు చేస్తున్నారు. ఈ భేటీలో సీమాంధ్ర మంత్రులెవరూ పాల్గొనటంలేదు.