: నిండు కుండలా శ్రీశైలం
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు అయితే, తాజాగా నీటిమట్టం 884 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి రిజర్వాయర్ లోకి 3,71,675 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు 3,08,795 క్యూసెక్కులను విడిచి పెడుతున్నారు.