: యాప్‌తో ఏదైనా సాధ్యమేనట!


పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనకు రక్షణతోబాటు మనకు ఎదరయ్యే పలు సమస్యలకు కూడా పరిష్కారాలను కనుగొనే విధంగా యాప్స్‌ అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపధ్యంలో విడిపోయిన మనసులను, మనుషులను కలిపేందుకేకాక విడిపోవాలనుకుంటున్నవారికి కూడా ఉపయుక్తంగా ఉండేలా కొత్తరకం యాప్స్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ యాప్స్‌తో విడిపోయిన వారు కలిసిపోవడమేకాదు విడిపోవాలనుకునేవారు కూడా చక్కగా విడిపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికాలోని న్యూయార్స్‌కు చెందిన జేక్‌ లెవిన్‌, లారెన్‌లీటోలు రెండు రకాలైన యాప్స్‌ని అభివృద్ధి చేశారు. బ్రేకప్‌ టెక్ట్స్‌, మేకప్‌ టెక్ట్స్‌ అనే రెండు పేర్లతో అభివృద్ధి చేసిన ఈ యాప్స్‌ మీరు ఇతర కారణాలవల్ల విడిపోయిన వారిని కలపడమేకాదు, మీరు వద్దనుకున్నవారిని మీ నుండి దూరం చేసేందుకు కూడా ఉపకరిస్తాయని చెబుతున్నారు. ఈ యాప్స్‌ మొదట మీరు విడిపోయేందుకు లేదా కలిసేందుకు సంబంధించిన కారణాలను అడుగుతాయి. వాటికి సమాధానాలను ఇస్తే చాలు, ఇక అవతలి వ్యక్తి ఫోన్‌ నంబరుకు చక్కటి సందేశాన్ని చేరవేస్తాయి. ఈ మేరకు ఈ యాప్స్‌ వివరాలను 'న్యూయార్స్‌ డెయిలీ' వెల్లడించింది.

  • Loading...

More Telugu News