: మోపిదేవికి నిరాశ
జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండ్ అనుభవిస్తున్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణకు నిరాశ తప్పలేదు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. ఇటీవల తరచూ అనారోగ్యం బారిన పడుతున్న మోపిదేవి ఆరోగ్య స్థితిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానం మెడికల్ బోర్డును ఆదేశించింది.