: హాలీవుడ్ సినిమాలో డేల్ స్టెయిన్
భీకరమైన పేస్ తో బ్యాట్స్ మెన్ కు వణుకు పుట్టించే దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ డేల్ స్టెయిన్ ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడు. 'ఫ్యామిలీ మూన్' పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆడమ్ శాండ్లర్, డ్రూ బ్యారీమోర్ ప్రధాన తారాగణం. డేటింగ్ అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో కలిసి జీవించే జంటగా శాండ్లర్, బ్యారీమోర్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో స్టెయిన్ క్రికెటర్ పాత్రనే పోషించనున్నాడు. ఇటీవలే సఫారీ పేస్ గన్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సినిమాను ప్రఖ్యాత టైమ్ వార్నర్ సంస్థ నిర్మిస్తోంది. అన్నట్టు, ఈ హాలీవుడ్ మూవీలో అమెరికా బాస్కెట్ బాల్ స్టార్ షకీల్ ఓ నీల్ కూడా తళుక్కుమననున్నాడు.