: కోల్ స్కామ్ లో సీబీఐకు సహకరించాలి : కేంద్రానికి సుప్రీం ఆదేశం


దేశంలో సంచలనం సృష్టించిన కోల్ గేట్ స్కామ్ లో సీబీఐ కు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోల్ స్కామ్ లో దర్యాప్తుకు సంబంధించి సీబీఐ కోరిన ఫైళ్లను అందజేయాలని చెప్పింది. బొగ్గు శాఖకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వాలంటే కొంత సమయం పడుతుందని ఆ శాఖ కొన్నిరోజుల కింద చెప్పడంపై సీబీఐ సుప్రీంలో సవాలు చేసింది. దాంతో, తాజాగా న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ఇక, ఈ కేసులో సేకరించిన మొత్తం సమాచారాన్ని ఆగస్టు 29న సమర్పించాలని సుప్రీం.. సీబీఐని ఆదేశించింది.

  • Loading...

More Telugu News