: మంత్రి పార్థసారథికి సమైక్య సెగ
మంత్రి పార్థసారథికి సమైక్య సెగ తగిలింది. విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డులోని మంత్రి పార్థసారథి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. తక్షణం పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రం ముక్కలవుతుంటే కాంగ్రెస్ మంత్రులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాజీనామా చేసి ప్రజల్లోకి రాకుంటే.. త్వరలోనే ఎన్నికలు ఉన్నాయని, అందులో చేదు ఫలితాలు చవిచూస్తారని ఉద్యమకారులు హెచ్చరించారు.